భారతదేశం, జనవరి 22 -- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ చేపట్టగా. ఈ గడువు జనవరి 21వ తేదీతో ముగిసింది. అయితే అధికారులు మరో అవకాశం కల్పించారు. దరఖాస్తుల గడువును ఈనెల 25వ తేదీ వరకు పొడిగించారు. అర్హత ఉన్న విద్యార్థులు వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని సూచించారు.

టీజీ గురుకుల సెట్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరం కింద ఐదో తరగతిలో ప్రవేశాలు ((TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS,TGREIS) కల్పిస్తారు. ప్రస్తుతం నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసేందుకు అర్హులవుతారు.ప్రభుత్వ ఆధ్వర్యంలోని 4 గురుకుల సొసైటీలలో ఈ ఎంట్రెన్స్ ద్వారానే అడ్మిషన్లను పూర్తి చేస్తారు. అంతేకాకుండా 6, 7, 8, 9వ తరగతు...