Telangana, ఏప్రిల్ 10 -- తెలంగాణలోని రిజిస్ట్రేషన్ల శాఖలో సరికొత్త మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవాళ్టి(ఏప్రిల్ 10) నుంచే ఈ విధానం అమల్లోకి రాగా.. కేవలం పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద రాష్ట్ర వ్యాప్తంగా 22 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అమలు చేస్తున్నారు.

ఈ సరికొత్త మార్పులతో రిజిస్ట్రేషన్ల శాఖలో మార్పులు రానున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే. రాష్ట్రవ్యాప్తంగా అనఅని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ తరహా సేవలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సరికొత్త విధానంలో కేవలం 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త విధానం గురించి ముఖ్యమైన అంశాలు ఇక్కడ చూడండి..

పారదర్శకంగా రిజిస్...