భారతదేశం, ఏప్రిల్ 4 -- తెలంగాణలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్- 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 1వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరిస్తున్నారు. అయితే దీని గడవు దగ్గరపడింది. ఇవాళ్టి (ఏప్రిల్ 4వ తేదీ) వరకుఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. ఈ నేపథ్యంలో.. అర్హులైన విద్యార్థులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఆలస్య రుసుము చెల్లించి ఏప్రిల్ 24 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 9 వరకు రూ. 250, ఏప్రిల్ 14 వరకు రూ. 500 ఆల‌స్య రుసుముగా అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ 18 వరకు రూ. 2500, ఏప్రిల్ 24 వరకు రూ. 5 వేల ఆల‌స్య రుసుముతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు వివరించారు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్...