భారతదేశం, మార్చి 29 -- మహాత్మా జ్యోతిబాఫులే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద.. విదేశాల్లో ఉన్నత విద్య కోసం అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30 వరకు ఈ పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని.. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి వివరించారు.
డిగ్రీలో 60 శాతం మార్కులతోపాటు ఈ ఏడాది జులై 1 నాటికి 35 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. అప్లై చేసుకునే వారి కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలి. బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా.. ఎంపికైన విద్యార్థులకు విదేశాల్లో మాస్టర్స్, పీహెచ్డీ కోర్సులు చేయడానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.