భారతదేశం, మార్చి 29 -- మహాత్మా జ్యోతిబాఫులే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద.. విదేశాల్లో ఉన్నత విద్య కోసం అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 30 వరకు ఈ పాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని.. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌ బాల మాయాదేవి వివరించారు.

డిగ్రీలో 60 శాతం మార్కులతోపాటు ఈ ఏడాది జులై 1 నాటికి 35 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. అప్లై చేసుకునే వారి కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలి. బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా.. ఎంపికైన విద్యార్థులకు విదేశాల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సులు చేయడానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు....