భారతదేశం, మార్చి 17 -- సంస్థ నుంచి మోస్ట్​ అఫార్డిబుల్​ ఎలక్ట్రిక్​ కారును టెస్లా రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది టెస్లా 'మోడల్​ వై'కి చిన్న, చీపర్​ వర్షెన్​ అని సమాచారం. దీని వల్ల సంస్థకు 20శాతం తక్కువ ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఇండియాలో టెస్లా ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఈ వార్తకు ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే..

పలు మీడియా నివేదిక ప్రకారం, ఈ కొత్త టెస్లా మోడల్ పూర్తిగా కొత్త కారు కాదు. కానీ ప్రస్తుత మోడల్ వైకి రీవర్క్​డ్​ వర్షెన్! తన బలమైన ఎక్స్​పెన్సివ్​ పోర్ట్​ఫోలియోతో పాటు బడ్జెట్​ ఫ్రెండ్లీ వేరియంట్లను కూడా లాంచ్​ చేసేందుకు ఎలాన్​ మస్క్​కి చెందిన టెస్లాకి ఈ ఎలక్ట్రిక్​ కారు ఉపయోగపడనుంది.

సరసమైన ఎలక్ట్రిక్ కారుతో టెస్లా తన భారత కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఇంతకు ముందు నివేదికలు వచ్చిన విషయం తెలిసిందే...