భారతదేశం, ఫిబ్రవరి 18 -- దిగ్గజ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ​ సంస్థ టెస్లా, ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వడంపై కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది. ఇదిగో వచ్చేస్తోంది, అదిగో వచ్చేస్తోందంటూ గతేడాది టెస్లా ఇండియా ప్లాన్స్​పై చాలా రూమర్స్​ వినిపించాయి. ఇక ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజా అమెరికా పర్యటన అనంతరం ఎలాన్​ మస్క్​కి చెందిన ఈ కంపెనీ నుంచి బిగ్​ అప్డేట్​ వచ్చింది! భారత దేశంలో ఉద్యోగుల వేటాలో పడింది టెస్లా. ఈ మేరకు లింక్డ్​ఇన్​లో వివిధ రోల్స్​ కోసం అప్లికేషన్లు ఆహ్వానించింది. ఎలాన్​ మస్క్​- మోదీ మధ్య చర్చలు జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ వార్త బయటకు రావడం విశేషం.

ఇండియాలో ఉద్యోగుల కోసం టెస్లా అన్వేషిస్తుండటంతో వాహన తయారీదారు రానున్న రోజుల్లో ఇండియాలోకి ప్రవేశించే అవకాశలు మరింత పెరిగాయనే చెప్పుకోవాలి. ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు సోమవారం తన లింక్డ్...