భారతదేశం, ఫిబ్రవరి 19 -- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన అనంతరం.. ఇండియాలో ప్రముఖ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ టెస్లా ఎంట్రీకి వేగంగా అడుగులుపడుతున్నట్టు కనిపిస్తోంది! ఇండియాలో ఉద్యోగుల అన్వేషణలో ఉన్న టెస్లా.. ఇప్పుడు దేశంలో షోరూమ్స్​ని ఏర్పాటు చేసి, ఏప్రిల్​ నుంచే సేల్స్​ ప్రారంభించాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు రెండు ప్రధాన నగరాల్లో టెస్లా షోరూమ్స్​ రానున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. దేశ రాజధాని దిల్లీ, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో షోరూమ్స్​ని ఓపెన్​ చేయాలని ఎలాన్​ మస్క్​కి చెందిన టెస్లా నిర్ణయించుకుంది.

ప్రపంచంలో మూడొవ అతిపెద్ద ఆటో మార్కెట్లోకి ప్రవేశించడానికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు గత కొన్నేళ్లుగా ప్లాన్​ చేస్తోంది. భారతదేశంలో టెస్లా షోరూమ్స్​ వేట గత ఏడాది కాలంగా కొనసాగుత...