భారతదేశం, మార్చి 10 -- ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్ సంస్థ టెస్లా ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కోంటోంది. ప్రపంచంలోని అనేక దేశాలలో కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గాయి. యూరప్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఆటోబ్లాగ్ నివేదిక ప్రకారం.. ఈ పతనం కారణంగా ఎలోన్ మస్క్ కంపెనీ టెస్లా కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి అనేక రకాల ఆఫర్లను అందిస్తోంది.

అమెరికా ప్రభుత్వంలో మస్క్ జోక్యానికి నిరసనగా చాలా మంది సెలబ్రిటీలు తమ టెస్లా కార్లను వదిలివేస్తున్న సమయంలో టెస్లా నుండి ఈ ఆఫర్లు వస్తున్నాయి. కొంతమంది టెస్లా యజమానులు తమ వాహనాలపై రకరకాల స్టిక్కర్లను అతికిస్తున్నారు. ఒక స్టిక్కర్ మీద 'ఎలోన్ పిచ్చితనం గురించి మాకు తెలియనప్పుడు నేను ఈ కారు కొన్నాను.' అని రాసి ఉంది. కొంతమంది టెస్లా షోరూమ్‌ల దగ్గర నిరసన వ్యక్తం చేసే దాకా వెళ్లారు.

టెస్లా తన కార్లను అమ్మడానికి అనే...