భారతదేశం, మార్చి 22 -- Telugu Serial: జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న లాంగెస్ట్ ర‌న్నింగ్ సీరియ‌ల్‌ ప్రేమ ఎంత మ‌ధురం క్లైమాక్స్‌కు చేరుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ సీరియ‌ల్‌కు శుభం కార్డు ప‌డ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్‌కు సంబంధించిన ఓ మేకింగ్ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

ఇందులో శంక‌ర్‌, గౌరితో పాటు వారి త‌మ్ముళ్లు, చెల్లెళ్ల‌కు పెళ్లి జ‌రిగిన‌ట్లుగా క‌నిపిస్తోంది. క్లైమాక్స్ ఎపిసోడ్ షూటింగ్‌కు సంబంధించిన మేకింగ్‌ వీడియో ఇద‌ని సీరియ‌ల్ ఫ్యాన్స్ చెబుతోన్నారు. ఈ పెళ్లిళ్ల‌తోనే ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్‌ను ఎండ్ చేస్తార‌ని అంటున్నారు. ఈ సీరియ‌ల్ ఎండింగ్ డేట్‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌లే ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్‌ 1500 ఎపిసోడ్స్‌ పూర్తిచ...