భారతదేశం, మార్చి 6 -- Telugu Serial: ఖుష్బూ సుంద‌ర్ లీడ్ రోల్‌లో న‌టించిన ల‌క్ష్మి స్టోర్స్ సీరియ‌ల్ త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో సూప‌ర్ హిట్‌గా నిలిచింది. బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అమితంగా మెప్పించిన ఈ సీరియ‌ల్ మ‌రోసారి తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ల‌క్ష్మి స్టోర్స్ సీరియ‌ల్‌ను రీ టెలికాస్ట్ చేయ‌బోతున్న‌ట్లు జెమిని టీవీ ప్ర‌క‌టించింది. ఏ రోజు నుంచి ప్ర‌సార‌మ‌వుతుంద‌న్న‌ది రివీల్ చేయ‌లేదు.

ల‌క్ష్మి స్టోర్స్ తెలుగులో సేమ్ టైటిల్‌తో డ‌బ్ అయ్యింది. 2020లో జెమిని టీవీలో టెలికాస్ట్ అయ్యింది. కొన్నాళ్ల పాటు బొమ్మ‌రిల్లు పేరుతో ఈ సీరియ‌ల్‌ను డ‌బ్ చేశారు. అనుకున్నంత ఆద‌ర‌ణ రాక‌పోవ‌డంతో ల‌క్ష్మి స్టోర్స్‌గా టైటిల్‌ను ఛేంజ్ చేశారు.

ల‌క్ష్మి స్టోర్స్ సీరియ‌ల్‌లో ఖుష్బూ సుంద‌ర్‌తో పాటు ముర‌ళీ మోహ‌న్‌, సుధా చంద్ర‌న్‌, సీనియ‌ర్ హీరో సురేష్‌, ఢిల్లీ ...