భారతదేశం, మార్చి 12 -- మ‌జాకా మూవీ సందీప్‌కిష‌న్‌కు హిట్టు ఇవ్వ‌లేక‌పోతుంది. థియ‌ట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్‌తో డిస‌పాయింట్ చేసింది. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 26న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ప‌ధ్నాలుగు రోజుల్లో ఈ మూవీ 13 కోట్ల వ‌ర‌కు గ్రాస్‌, ఆరున్న‌ర కోట్ల షేర్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. దాదాపు 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో మ‌జాకా రిలీజైంది. ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే ఇంకా ఐదు కోట్ల‌కుపైనే క‌లెక్ష‌న్స్ రావాల్సివుంది. ఇప్ప‌టికే క‌లెక్ష‌న్స్ భారీగా డ్రాప‌వుట్ అయిన నేప‌థ్యంలో మ‌జాకా బ్రేక్ ఈవెన్ కావ‌డం అనుమాన‌మేన‌ని చెబుతోన్నారు.

కాగా మ‌జాకా మూవీ మార్చి నెలాఖ‌రున ఓటీటీలోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ5 ఓటీటీ సొంత...