తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 18 -- Rats in Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat)ఎలుకలు సంచరిస్తున్నాయి.చైర్స్, టేబుళ్ళు,సోఫాలు కింద,బీరువాలు, ర్యాక్ లలో ఎలుకలు తిరుగుతున్నాయట...! దీంతో సెక్రటేరియట్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీరువాలో, ర్యాకుల్లో ఉన్న ఫైల్స్ ను అవి ఎక్కడ కొరికి వేస్తాయోనని అధికారులు టెన్షన్ పడుతున్నారు. కొత్తగా నిర్మించిన భవనంలోకి ఎలుకలు ఎలా వస్తున్నాయో అర్థం గాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే వాటిని నివారించేందుకు పలు క్యాబిన్ లలో,గదుల్లో ఎలుకల బోన్ తో పాటు వాటిని చంపే మందును ఏర్పాటు చేశారు.బయటకు మాత్రం అద్దాల మేడలా ఆకట్టుకునే విధంగా ఉన్న.....లోపల మాత్రం కొన్ని లోపాలు ఉన్నాయని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.ఇరుకైన గదులు,కొన్ని గదుల్లో వెంటిలేషన్ సమస్య,ఫైల్స్ ను భధ...