భారతదేశం, ఫిబ్రవరి 14 -- రేషన్ కార్డు ఉన్నవారికి రేవంత్ సర్కారు శుభవార్త చెప్పింది. దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఈ ఉగాది నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంపిణీ చేయడానికి బియ్యం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.వానాకాలం ధాన్యం సేకరణ ప్రక్రియ ముగిసింది. దీంతో మిల్లింగ్‌పై పౌర సరఫరాల సంస్థ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.

2.ధాన్యం సేకరణ నుంచి సన్న, దొడ్లు వడ్లను బస్తాల్లో నింపడం, మిల్లులకు పంపడం, ఆ తర్వాత కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ వరకు అధికారులు వేర్వేరుగా చేయిస్తున్నారు.

3.ఈనెల తొలివారం నాటికి 4.59 లక్షల టన్నుల సన్నబియ్యం సిద్ధమైనట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు.

4.బియ్యం సి...