భారతదేశం, జనవరి 31 -- మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల ఎంతోమంది మేధావులను అందించిందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ గ్రామాన్ని, పాఠశాలను అభివృద్ధి చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ విజ్ఞప్తి చేశారన్న సీఎం.. 150 సంవత్సరాల ఈ పాఠశాల గొప్పతనాన్ని వివరించారని చెప్పారు. హైదరాబాద్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు లాంటి వారిని ఈ పాఠశాల అందించిందని వివరించారు.

'తెలంగాణలో ఈ గ్రామాన్ని, పాఠశాలను అభివృద్ధి చేసి.. భావితరాలకు ఒక చరిత్రగా అందించాల్సిన అవసరం ఉంది. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ గ్రామానికి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను మంజూరు చేశాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. 11 వేల మంది ఉపాధ్యాయులను నియమించి పాఠశాలలను బల...