భారతదేశం, ఫిబ్రవరి 1 -- తెలంగాణ కాంగ్రెస్లో కొత్త అలజడి మొదలైంది. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సమీపంలోని ఓ ఎమ్మెల్యేకు చెందిన ఫాంహౌస్లో వీరు భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇద్దరు కేబినెట్ మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు.. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేసినట్టు తెలుస్తోంది.
ఈ 10 మందిలో ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్టు సమచారం. 10 మంది ఎమ్మెల్యేల సమావేశంపై కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.