భారతదేశం, ఫిబ్రవరి 1 -- తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త అలజడి మొదలైంది. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌ సమీపంలోని ఓ ఎమ్మెల్యేకు చెందిన ఫాంహౌస్‌లో వీరు భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇద్దరు కేబినెట్ మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు.. భవిష్యత్‌ కార్యాచరణపై సమాలోచనలు చేసినట్టు తెలుస్తోంది.

ఈ 10 మందిలో ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్టు సమచారం. 10 మంది ఎమ్మెల్యేల సమావేశంపై కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు వెళ్లారు సీఎం రేవంత్‌ రెడ్డి. మంత్రులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ...