భారతదేశం, మార్చి 2 -- ఈనెల 3వ వారంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి.. ప్రతిపాదనలు స్వీకరించారు. ఏ శాఖలో ఎలాంటి పథకాలు ఉన్నాయి.. నిధులు ఎంత అవసరం.. వంటి అంశాలపై ఓ అంచనాకు వచ్చారు.
ఈసారి రాబడులపై భారీ ఆశలు ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో ఆదాయ లోటు వస్తే పరిస్థితి ఏంటనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనుకున్నంత మేర ఆదాయం రాలేదు. దీంతో వచ్చే ఏడాదికి సంబంధించి అంచనాలపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.91 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసారి రూ.3 లక్షల కోట్ల పైనే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ వారంలో దీని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.