తెలంగాణ,హైదరాబాద్, మార్చి 8 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంపై ప్రకటన వెలువడింది. మార్చి 12వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభతో పాటు మండలి కూడా ప్రారంభమవుతుందని. అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

మార్చి 12వ తేదీన ఉదయం 11 గంటలకు అసెంబ్లీ హాలులో ఉభయ సభలను ఉద్దేశించి.. రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం ఉండనుంది. అయితే ఈసారి సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడుతుంది.

మొదటి రోజు గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చర్చ జరిగిన అనంతరం తీర్మానాన్ని ఆమోదిస్తారు. ఆ తర్వాత హోలీ, ఆదివా...