తెలంగాణ,హైదరాబాద్, మార్చి 12 -- ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవలే జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. డిలిమిటేషన్ ప్రక్రియపై తీర్మానం చేసే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా.. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ విషయంపైనా సభలో చర్చించే అవకాశం ఉంది.

ఈ నెల 19 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖలకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పించారు. ఈసారి తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 20 వేల కోట్లు ఉండే అవకాశం ఉంది.

తెలంగాణలో గవర్...