భారతదేశం, ఫిబ్రవరి 13 -- రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ట్రాన్స్ జెండర్ అభ్యర్థి విక్టరీ కొట్టారు. నల్గొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నాగిళ్ల కావేరి సుధాకర్(ట్రాన్స్ జెండర్) విజయం సాధించారు.
ఈ వార్డులో కాంగ్రెస్ మద్దతుతో సీపీయం అభ్యర్థిగా నగేశ్ పోటీ చేశారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసిన నాగిళ్ల కావేరి సుధాకర్ 109 ఓట్ల మెజారిటీతో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
మరోవైపు చిట్యాల మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డులకు గానూ 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ కేవలం రెండు వార్డుల్లో మాత్రమే గెలుపొందింద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.