భారతదేశం, మార్చి 18 -- OTT: ప్రేమ‌లు ఫేమ్ న‌స్లీన్ హీరోగా న‌టించిన ఐ యామ్ క‌థ‌లాన్ మూవీ స‌డెన్‌గా మ‌రో ఓటీటీలోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్ప‌టికే ఈ మ‌ల‌యాళం సినిమా మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో కూడా మేక‌ర్స్ ఈ మూవీని రిలీజ్ చేశారు. రెండు ఓటీటీల‌లో కేవ‌లం మ‌ల‌యాళ వెర్ష‌న్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.

ఐయామ్ క‌థ‌లాన్ మూవీకి ప్రేమ‌లు ఫేమ్ గిరీష్ ఏడీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సైబ‌ర్ క్రైమ్ టెక్నో థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన‌ ఈ మూవీలో అనీష్మా అనిల్‌కుమార్ హీరోయిన్‌గా న‌టించింది.

న‌స్లీన్‌, గిరీష్ కాంబోలో వ‌చ్చిన ప్రేమ‌లు మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌డ‌మే కాకుండా థియేట‌ర్ల‌లో వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డంతో ఐ యామ్ క‌థ‌లాన్‌పై భారీగా అంచ‌నాలు ఏర...