భారతదేశం, ఏప్రిల్ 8 -- Teaser: డియ‌ర్ ఉమ మూవీతో తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. రొమాంటిక్ ల‌వ్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ టీజ‌ర్‌ను డైరెక్ట‌ర్ శివ నిర్వాణ రిలీజ్ చేశారు. టీజర్ ఎంతో బాగుందని, ల‌వ్ స్టోరీతో పాటుగా అంతర్లీనంగా మంచి సందేశాన్నిచ్చే ఫీల్ గుడ్ మూవీగా డియ‌ర్ ఉమ క‌నిపిస్తుంద‌ని శివ‌నిర్వాణ అన్నారు.

'గుడిలో దేవుడి వద్ద చేసే ప్రార్థనల కన్నా.. హాస్పిటల్‌లో నాలుగు గోడల మధ్య చేసే ప్రార్థనేలా ఎక్కువ' అనే డైలాగ్‌తో డియ‌ర్ ఉమ టీజ‌ర్ ప్రారంభ‌మైంది. 'రెండు జీవితాలు.. రెండు ప్రపంచాలు.. రెండు భావోద్వేగాలు.. ఇద్దరి ప్రేమలు.. ఒక హృదయం.. ఒక యుద్దం', 'పేషెంట్స్‌కి, డాక్టర్లకు మధ్య మీలాంటి కమిషన్స్ ఏజెన్సీ, బ్రోకర్లు ఉండకూడదు సర్.. దీని కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను' అనే డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయ...