భారతదేశం, ఏప్రిల్ 7 -- బ్లాక్​ మండే నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​లు విపరీతమైన నష్టాలను చూస్తున్నాయి. అనేక స్టాక్స్​లో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా గత కొన్ని నెలలుగా విపరీతంగా పడిన టాటా మోటార్స్​ స్టాక్​.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో మరింత పతనమైంది! ట్రెడింగ్​ సెషన్​ ఓపెనింగ్​లోనే 10శాతం మేర పడి రూ. 535.75 వద్ద 52 వీక్​ లో-ని నమోదు చేసింది. ఇందుకు కారణాలేంటి? టాటా మోటార్స్​ స్టాక్​ ఎందుకు పడుతోంది? ఇప్పుడు కొనొచ్చా? టాటా మోటార్స్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఏంటి? ఈ కంపెనీలో ఇన్వెస్ట్​ చేసిన ప్రతి ఒక్కరు ఈ విషయాలు తెలుసుకోవాలి..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఉదయం 11 గంటలకు టాటా మోటార్స్​ 8.4శాతం నష్టంతో రూ. 562 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ స్టాక్​ 25శాతం నష్టపోయింది. ఏడాదిలో 44శాతం ఫాల్​ అయ్యింది.

ఇక సో...