Hyderabad, మార్చి 23 -- Tamanna About Odela 2 Movie In Press Meet: మిల్కీ బ్యూటి తమన్నా నటించిన లేటెస్ట్ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓదెల్ 2. డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్‌గా అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఓదెల 2 సినిమాలో నాగ సాధువుగా, భైరవి పాత్రలో తమన్నా నటించారు.

ఏప్రిల్ 17న ఓదెల 2 మూవీ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా మార్చి 22న ఓదెల 2 రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఓదెల 2 ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ విశేషాలు పంచుకున్న తమన్నా భాటియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

హీరోయిన్ తమన్నా భాటియా మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఓదెల రైల్వే స్టేషన్ సినిమాని డైరెక్టర్ అశోక్ గారు చాలా అద్భుతంగా తీశారు. ఆ సినిమా చూసినప్పుడే దానికి పార్ట్ 2 ఉండాలని భావించాను. సంపత్ నంద...