భారతదేశం, ఫిబ్రవరి 5 -- స్వీడన్లోని ఒరెబ్రో నగరంలోని ఒక పాఠశాలలో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన తర్వాత పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ ఘటనలో అనుమానితుడు కూడా మరణించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. కాల్పుల ఘటనతో ఒర్రెబోలోని పాఠశాల ఉన్న ప్రాంతమంతా ఉలక్కి పడింది. వెంటన భద్రతా బలగాలు చేరుకుని సహాయక చర్యలు మెుదలుపెట్టాయి.
దాడి చేసిన వ్యక్తికి ఏ సంస్థతోనూ సంబంధం ఉందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో జరిగింది. దీని కారణంగా ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ఈ కాల్పుల్లో 10 మంది గాయపడ్డారు.
దర్యాప్తు, భద్రతా పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండటానికి పాఠశాల దగ్గరకు వెళ్లవద్దని పోలీసులు స్థానిక ప్రజలకు విజ్ఞ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.