భారతదేశం, ఫిబ్రవరి 5 -- స్వీడన్‌లోని ఒరెబ్రో నగరంలోని ఒక పాఠశాలలో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన తర్వాత పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ ఘటనలో అనుమానితుడు కూడా మరణించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. కాల్పుల ఘటనతో ఒర్రెబోలోని పాఠశాల ఉన్న ప్రాంతమంతా ఉలక్కి పడింది. వెంటన భద్రతా బలగాలు చేరుకుని సహాయక చర్యలు మెుదలుపెట్టాయి.

దాడి చేసిన వ్యక్తికి ఏ సంస్థతోనూ సంబంధం ఉందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో జరిగింది. దీని కారణంగా ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ఈ కాల్పుల్లో 10 మంది గాయపడ్డారు.

దర్యాప్తు, భద్రతా పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండటానికి పాఠశాల దగ్గరకు వెళ్లవద్దని పోలీసులు స్థానిక ప్రజలకు విజ్ఞ...