భారతదేశం, ఫిబ్రవరి 20 -- హ్యుందాయ్ ఇండియా ఈ ఏడాది వరుసగా కొత్త మోడళ్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా కంపెనీకి మంచి సక్సెస్ అందించిన మైక్రో ఎస్​యూవీ 'ఎక్స్​టర్​' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకువస్తోంది. తాజాగా కొరియాలో ఈ కారు టెస్టింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. భారీగా కవర్ చేసినప్పటికీ, ఈ కొత్త వెర్షన్‌లో రాబోయే మార్పులపై ఒక స్పష్టత వచ్చింది. వాటి వివరాలను ఇక్కడ చూసేయండి..

మొదటి చూపులో 2026 ఎక్స్​టర్​ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత మోడల్ లాగే కనిపిస్తోంది. గ్రిల్, హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ డిజైన్‌లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు.

వీల్స్: టెస్టింగ్ చేస్తున్న కారులో స్టీల్ వీల్స్ ఉన్నాయి. అంటే ఇది బేస్ వేరియంట్ (ఈఎక్స్​ లేదా ఈఎక్స్​(ఓ)) అయ్యే అవకాశం ఉంది.

స్టాన్స్: హ్యుందాయ్​ ఎక్స్​టర్​కే గుర్తింపునిచ్చే ఆ మస్క్యులర్​ వ...