తెలంగాణ,సూర్యాపేట, జనవరి 29 -- సూర్యాపేట జిల్లాలో దళిత యువకుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన సంచలనంగా మారింది. అయితే ఈ కేసులోని అసలు విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే. యువకుడి హత్య జరిగినట్లు తేలింది. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.

సూర్యాపేట జిల్లాలో జనవరి 26వ తేదీన రాత్రి మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి హత్యకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున పిల్లలమర్రి గ్రామం వద్ద ఉన్న కాలువలో కృష్ణ డెడ్ బాడీ లభ్యమైంది. అయితే ఈ హత్యకు ప్రధాన కారణం ప్రేమ వివాహమే అని తేలింది. హత్య చేసిన నిందితుల వివరాలు కూడా బయటికి వచ్చాయి.

సూర్యాపేటకు చెందిన కృష్ణ అలియాస్ బంటి(షెడ్యూల్ కులం).. పిల్లలమర్రికి చెందిన భార్గవి(బీసీ కులం)ని ప్రేమించాడు. ఈ క్రమంలోనే ఆర్నేళ్ల క్రితం వీరూ వివాహం చేసుకున్నారు. వీర...