భారతదేశం, మార్చి 18 -- 9 నెలల పాటు ఐఎస్​ఎస్​లో చిక్కుకున్న వ్యోమగాములు సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​లు ఎట్టకేలకు భూమికి బయలుదేరారు. ఐఎస్​ఎస్​కి వీడ్కోలు పలికి, మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి వీరిద్దరు క్రూ-9లో భూమికి తిరిగివస్తున్నారు. ఇంతకి, వీరు 9 నెలల పాటు అంతరిక్షంలో ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? వీరిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి?

8 రోజుల మిషన్​లో భాగంగా సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​లు బోయింగ్​ రూపొందించిన సరికొత్త స్టార్​లైనర్​ క్యాప్సూల్​లో జూన్​ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ అదే క్యాప్సూల్​లో సమస్యల కారణంగా వారు అనుకున్న సమయానికి తిరిగి రాలేకపోయారు.

ఐఎస్​ఎస్​కి వెళ్లిన తర్వాత వ్యోమగాములు స్టార్​లైనర్​ని పరీక్షించారు. థ్రస్టర్స్​లోని టెఫ్లాన్​ సీల్స్​లో సమస్యలు కనిపించాయి. అవి దెబ్బతిన్నట్టు అర...