భారతదేశం, మార్చి 18 -- 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​లు ఇంకొన్ని గంటల్లో భూమికి తిరిగిరానున్నారు. ఈ ఘట్టం కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒక వారం కోసం జూన్​లో స్పేస్​కి వెళ్లిన ఈ వ్యోమగాములు.. అనుకోని పరిస్థితుల్లో 9 నెలల పాటు ఐఎస్​ఎస్​లో ఉండిపోవాల్సి వచ్చింది. మరి ఈ కాల వ్యవధికి సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​కి 'ఓవర్​టైమ్​ కాంపెన్సేషన్​' ఏమైనా ఉంటుందా? వ్యోమగాములకు నాసా ఇప్పుడు ఎంత చెల్లిస్తుంది? అని తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంది. ఆ వివరాలతో పాటు సునితా విలియమ్స్​ జీతం ఎంతో కూడా ఇక్కడ తెలుసుకోండి..

నాసా మాజీ వ్యోమగామి కాడీ కోల్​మన్​ ప్రకారం.. అస్ట్రోనాట్స్​కి సాధారణ జీతాలు మాత్రమే ఉంటాయి. ఓవర్​టైమ్​ అంటూ ఏదీ ఉండదు! జీతంతో పాటు అంతరిక్షంలోకి వెళ్లి రావడ...