భారతదేశం, ఫిబ్రవరి 17 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 200 పాయింట్లు పడి 75,939 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 102 పాయింట్లు పడి 22,929 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 260 పాయింట్లు నష్టపోయి 49,099 వద్దకు చేరింది.

"నిఫ్టీ50 ప్రస్తుతం వీక్​గా ఉంది. 22,800 వద్ద సపోర్ట్​ ఉంది. అది కూడా బ్రేక్​ అయితే నిఫ్టీ50 22,600- 22,500 వద్దకు వెళ్లొచ్చు. 23,000 వద్ద కీలక రెసిస్టెన్స్​ ఉంది. అది దాటితే 23,200- 23,300 వద్దకు నిఫ్టీ50 వెళ్లొచ్చు," అని కొటాక్​ సెక్యూరిటీస్​ వీపీ- టెక్నికల్​ రీసెర్చ్​ అమోల్​ అథవాలే తెలిపారు.

దేశీయ స్టాక్​ మార్కెట్​లో ఎఫ్​ఐఐలు సెల్లింగ్​ కొనసాగుతోంది. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4294.69 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో...