భారతదేశం, జనవరి 28 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 824 పాయింట్లు పడి 75,366 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 263 పాయింట్లు కోల్పోయి 22,829 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 303 పాయింట్లు పడి 48,064 వద్దకు చేరింది.

"ప్రస్తుత మార్కెట్ స్ట్రక్చర్​ బలహీనంగా, అస్థిరంగా ఉందని మేము నమ్ముతున్నాము. నిఫ్టీ50, సెన్సెక్స్ 23,000- 76,300 స్థాయిలను కీలకంగా మారాయి. ఈ పరిమితికి దిగువన ట్రేడవుతున్నంత కాలం బలహీన సెంటిమెంట్ కొనసాగే అవకాశం ఉంది," అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు.

దేశీయ స్టాక్​ మార్కెట్​లో ఎఫ్​ఐఐలు సెల్లింగ్​ కొనసాగుతోంది. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 5,015.46 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు ర...