భారతదేశం, మార్చి 16 -- అమెరికా లాస్​ ఏంజెల్స్​లోని ఒక స్టార్​బక్స్​ ఔట్​లెట్​లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు కంపెనీకి పెద్ద తలనొప్పిగా మారింది! ఓ డెలివరీ డ్రైవర్​ మీద వేడి టీ పడటంతో అతను కేసు వేశాడు. అతనికి సానుకూలంగా తీర్పు వెలువడింది. ఫలితంగా, సదరు వ్యక్తికి స్టార్​బక్స్​ ఇప్పుడు 50 మిలియన్​ డాలర్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది! అసలేం జరిగిందంటే..

2020 ఫిబ్రవరి 8న మైఖెల్​ గర్షియా అనే డెలివరీ డ్రైవర్​.. ఆర్డర్​ పిక్​ చేసుకునేందుకు లాస్​ ఏంజెల్స్​లోని స్టార్​బక్స్​ ఔట్​లెట్​కి వెళ్లాడు. ఆర్డర్​లో 3 డ్రింక్స్​ ఉన్నాయి. వాటిల్లో ఒక దానికి లిడ్​ సరిగ్గా పెట్టి లేదు.

మైఖేల్​ ఆర్డర్​ తీసుకుని తన తొడల దగ్గర పెట్టున్న వెంటనే మూత ఊడి వచ్చేసింది. ఆ వేడి వేడి టీ అతని మీద పడింది. ఫలితంగా మైఖెల్​కి థర్డ్​ డిగ్రీ గాయాలు అయ్యాయి. ఆ తర్వాత అతని మర్మాంగాల...