భారతదేశం, జనవరి 28 -- సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‍లో గ్లోబల్ రేంజ్‍లో భారీ బడ్జెట్ మూవీ రూపొందనుంది. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. మహేశ్ బాబు పాస్‍పోర్ట్ సీజ్ చేసేశానంటూ రాజమౌళి సరదాగా ఇటీవల చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసేసింది. షూటింగ్ మొదలైందనేలా ఆయన హింట్ ఇచ్చారు. ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రాజెక్ట్ పేరు ఎస్ఎస్ఎంబీ29గా పిలుస్తున్నారు. ఈ గ్లోబల్ రేంజ్ మూవీలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు ఉండడం కచ్చితం. ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ స్టార్ ఫిక్స్ అయ్యారని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలివే..

మహేశ్ - రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం కీలక పాత్రలో నటించనున్నారనే సమాచారం బయటికి వచ్చింది. త్వరలోనే ఆయన షూటింగ్‍లో పాల్గొన...