Hyderabad, ఏప్రిల్ 5 -- శ్రీరామనవమి భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ పెళ్లిని చూసేందుకు ఎంతో మంది భక్తులు వెళతారు. ఆ పెళ్లి తంతులో స్వామివారి కల్యాణ తలంబ్రాలు ముఖ్యమైనవి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ అక్షింతల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు.

భక్తులు ఈ తలంబ్రాలు అందరికీ చేరవని... ఆ రాముడి కృప ఎవరికి ఉంటుందో వారికి అందుతాయని చెబుతూ ఉంటారు. పండితులు అయితే ఈ తలంబ్రాలను తయారు చేసే బియ్యం ఎవరు పండిస్తారు? ఎక్కడ నుంచి తెస్తారు? వాటి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.

సీతారాముల శిరస్సుపై నుంచి జాలువారిన ముత్యాల తలంబ్రాలు కోసం ఎంతోమంది భక్తులు భద్రాచలం వెళ్తారు. ఆన్లైన్ సర్వీసుల ద్వారా కూడా తెప్పించుకుంటారు. ఆ తలంబ్రాలు మెరుస్తూ ఉంటాయి. ఆదివారం ఏప్రిల్ 6న సీతారాముల కళ్యాణం జరగనుంది. ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు జరిగాయి. తలంబ్రాలు కూడా భద్రాచలం ఆలయానికి చ...