ఆంధ్రప్రదేశ్,శ్రీసత్యసాయి జిల్లా, మార్చి 22 -- శ్రీస‌త్య‌సాయి జిల్లాలో వ్య‌భిచార కుంప‌టి వ్యవహారం వెలుగులోకి వ‌చ్చింది. అసాంఘిక కార్య‌క‌లాపాల‌ను అరిక‌ట్టాల్సిన ఓ కానిస్టేబుల్ ఈ దందాలో కీలకంగా వ్యవహరించాడు. ఇత‌ర ప్రాంతాల నుంచి అమ్మాయిల‌ను తీసుకొచ్చి వ్య‌భిచార కుంప‌టిలోకి దింపేవారు. ఈ వ్యవహారాలన్నీ ఓ మహిళా చూసుకునేది. చుట్టుప‌క్క‌ల వారు హెచ్చ‌రించినా కానిస్టేబుల్ అండ‌తో వాటిని పట్టించుకోలేదు. దీంతో స్థానికులు.. పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. పోలీసులు దాడి చేసి కానిస్టేబుల్‌తో స‌హా మ‌హిళ‌ను అరెస్టు చేశారు.

ఈ ఘ‌ట‌న శ్రీ‌స‌త్య‌సాయి జిల్లాలో హిందూపురంలో మోడ‌ల్ కాల‌నీలో శుక్ర‌వారం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కానిస్టేబుల్ పురుషోత్తం హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ప‌ని చేసేవాడు. ఇటీవ‌లే మ‌డ‌క‌శిర స్టేష‌న్‌కు బ‌ది...