Hyderabad, జనవరి 30 -- Squid Game 3 OTT Streaming: స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఈ ఏడాదే ఓటీటీలోకి వస్తోంది. ఈ సూపర్ హిట్ వెబ్ సిరీస్ మూడో సీజన్ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. జూన్ 27 నుంచి కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. రెండో సీజన్ లాగా కాకుండా చాలా త్వరగానే ఈ మూడో సీజన్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటం విశేషం.

కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 గతేడాది డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలుసు కదా. తొలి సీజన్ వచ్చిన మూడేళ్ల తర్వాతగానీ ఈ రెండో సీజన్ రాలేదు.

కానీ మూడో సీజన్ కోసం మాత్రం అన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు. రెండో సీజన్ వచ్చిన సరిగ్గా ఏడు నెలల తర్వాత అంటే ఈ ఏడాది జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ...