భారతదేశం, జనవరి 31 -- రైలు నెంబ‌ర్‌ 07165 హైదరాబాద్ - కటక్ స్పెష‌ల్‌ రైలును మార్చి 25 వ‌ర‌కు పొడిగించారు. ఈ రైలు ప్ర‌తి మంగళవారం రాత్రి 8.10 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరుతుంది. ఆ రైలు మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు దువ్వాడ చేరుకుని.. ఉద‌యం 9.07 గంటలకు బయలుదేరి, సాయంత్రం 5.45 గంటలకు కటక్ చేరుకుంటుంది.

రైలు నెంబ‌ర్‌ 07166 కటక్-హైదరాబాద్ స్పెష‌ల్ రైలును మార్చి 26 వ‌ర‌కు పొడిగించారు. ఈ రైలు ప్ర‌తి బుధ‌వారం రాత్రి 10:30 గంటలకు కటక్‌లో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉద‌యం 7.35 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్క‌డ నుంచి ఉద‌యం 7.37 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. రాత్రి 7.35 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు హైద‌రాబాద్‌-క‌ట‌క్ మ‌ధ్య సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, ...