భారతదేశం, ఫిబ్రవరి 21 -- మోటోరోలా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2026 మొదటి 'ఎడ్జ్' సిరీస్ స్మార్ట్‌ఫోన్, మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ భారత మార్కెట్​లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్​లో ఈ ఫోన్ పేరు, కలర్​ ఆప్షన్స్​ వంటి వివరాలు ప్రత్యక్షమయ్యాయి. అధికారిక లాంచ్ తేదీపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వనప్పటికీ, లీకైన మార్కెటింగ్ చిత్రాలు, ఫ్లిప్‌కార్ట్ టీజర్లు ఈ ఫోన్ త్వరలోనే విడుదల కానుందని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో కనిపిస్తున్న టీజర్ ప్రకారం.. ఈ మోటోరోలా ఎడ్జ్​ 70 ఫ్యూజన్​ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఫిబ్రవరి 23న వెల్లడి కానున్నాయి. అయితే ప్రధానంగా డిజైన్, భారీ బ్యాటరీపై కంపెనీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ...