భారతదేశం, మార్చి 9 -- ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. టన్నెల్లో గల్లంతైన వారిని గుర్తించడంలో.. కాస్త పురోగతి కనిపించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్ దగ్గర మనుషుల ఆనవాళ్లను కేరళ కాడవర్ డాగ్స్ గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో రెస్క్యూ సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు.
అయితే.. మనుషుల ఆనవాళ్లు లభించినట్టు అధికారులు ఇంకా కన్ఫామ్ చేయలేదు. సొరంగంలో గల్లంతైన వారిలో కొందరిని ఆదివారం రాత్రి వరకు గుర్తించే అవకాశం ఉంది. మృతదేహాలు లభిస్తే.. బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం పరిశీలించారు. 11వ తేదీ మళ్లీ వస్తానని చెప్పారు. సీఎం రేవంత్ కూడా వెళ్లే అవకాశం ఉంది.
రెస్క్యూ ఆపరేషన్లో పనిచేసే కార్మికులు, అధికారుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.