భారతదేశం, మార్చి 18 -- బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన స్కైఫోర్స్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద నిరాశ ఎదురైంది. మంచి అంచనాలతో రిపబ్లిక్ డే వీక్‍లో జనవరి 24 విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే, అందుకు తగ్గట్టుగా కలెక్షన్లు దక్కించుకోలేక ప్లాఫ్‍గా నిలిచింది. పాకిస్థాన్ స్థావరంపై భారత్ చేసిన వైమానిక దాడి చుట్టూ ఈ మూవీ సాగుతుంది. స్కైఫోర్స్ మూవీ ఈవారంలోనే రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.

స్కైఫోర్స్ చిత్రం ఈ శుక్రవారం మార్చి 21వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సినిమ ఇప్పటికే ఆ ప్లాట్‍ఫామ్‍లో రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అయితే, మార్చి 21న రెంట్ తొలగిపోయి పూర్తిస్థాయి స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ప్రైమ్ వీడియో సబ్‍స్క్రిప్షన్ ఉన్నవారందరూ అప్ప...