భారతదేశం, అక్టోబర్ 11 -- స్కోడా ఇండియా ఇటీవల భారత మార్కెట్‌లో ఆక్టేవియా ఆర్​ఎస్ కారును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 17న అధికారికంగా లాంచ్ చేయనున్న ఈ వాహనం కోసం రూ. 2.50 లక్షల బుకింగ్ మొత్తంతో దరఖాస్తులు స్వీకరించడం మొదలుపెట్టింది. అియితే, ఈ కారుకు క్రేజీ డిమాండ్​ కనిపించింది! బుకింగ్స్​ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే, ఈ పవర్‌ఫుల్ వెర్షన్‌కు చెందిన 100 యూనిట్లు (కేవలం 100 మాత్రమే అమ్మకానికి ఉన్నాయి) పూర్తిగా అమ్ముడైపోయాయి!

2025 ఆక్టేవియా ఆర్​ఎస్​ ఒకే ఒక్క, ఫుల్లీ లోడెడ్ వేరియంట్‌లో లభిస్తుంది. ఇది ఆరు ఆకర్షణీయమైన రంగుల్లో (పెయింట్ షేడ్స్) అందుబాటులో ఉంటుంది: మాంబా గ్రీన్, మ్యాజిక్ బ్లాక్, రేస్ బ్లూ, క్యాండీ వైట్, వెల్వెట్ రెడ్. భారతదేశంలో కనిపించే ఆర్​ఎస్​ మోడల్ ప్రపంచవ్యాప్త మోడల్‌ను పోలి ఉంటుంది. ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించి...