భారతదేశం, ఫిబ్రవరి 3 -- స్కోడా ఆటో ఇండియా దేశవ్యాప్తంగా కొత్త కైలాక్ సబ్ కాంపాక్ట్ ఎస్​యూవీ డెలివరీలను ప్రారంభించింది. ఈ సబ్-కాంపాక్ట్ ఎస్​యూవీ బ్రాండ్​కి చెందిన అత్యంత సరసమైన వెహికిల్​గా గుర్తింపు తెచ్చుకుంది. ఫలితంగా, ఈ మోడల్​పై కస్టమర్స్​లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ ఎస్​యూవీకి వచ్చిన డిమాండ్​తో స్కోడా ఆటో బుకింగ్స్​ని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందంటే, ఈ కారు క్రేజ్​ని మనం అర్థం చేసుకోవచ్చు. 2024 డిసెంబర్​లో ఆర్డర్ బుక్స్ తెరిచిన మొదటి 10 రోజుల్లోనే ఈ కైలాక్​కి 10,000 బుకింగ్స్ వచ్చాయని కంపెనీ గతంలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్కోడా కైలాక్​ ఎస్​యూవీ వెయిటింగ్​ పీరియడ్​తో పాటు ఇతర వివరాలను ఇక్క తెలుసుకోండి..

వేరియంట్​ను బట్టి స్కోడా కైలాక్​ వేయిటింగ్​ పీరియడ్​ సగటున 6 నుంచి 8 వారాల మధ్యలో ఉందని డీలర్లు చెబుతున్నారు. మొదటి బ్యాచ్...