భారతదేశం, జనవరి 2 -- శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా 79 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 16 విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. దరఖాస్తుల గడువు జనవరి 31వ తేదీతో పూర్తవుతుంది.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హార్టికల్చర్ / అగ్రికల్చర్ / అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లో 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. అంతేకాకుండా ఉద్యోగానుభవం ఉండాలి. నెట్‌ అర్హత తప్పనిసరి అని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.

అభ్యర్థులు https://skltghu.ac.in/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 3 వేలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు అయితే రూ. 2 వేల ఫీజు చెల్లించాలి. కంప్ట్రోలర్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్శ...