తెలంగాణ,సిరిసిల్ల, ఏప్రిల్ 4 -- చదువులమ్మ ఒడి సర్కార్ బడి మూడనమ్మకాలకు వేధికయ్యింది. సిరిసిల్లలో కుసుమ రామయ్య జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పంతుళ్ళు అనాలోచితంగా క్షుద్రపూజలు నిర్వహించారు. పసుపుకుంకుమ చల్లి అగర్ బత్తుల పొగేసి గొర్రెను బలిచ్చేందుకు సిద్దమయ్యారు.

తెల్లవారుజామున ఐదు గంటలకు స్కూల్ గేట్ తెరిచి మనుషుల అలికిడి వినిపించడంతో అటుగా వెళ్ళిన మీడియా ప్రతినిధులకు బడిలో జరిగే మూడనమ్మకాల ముసుగులో క్షుద్రపూజల తతంగం బయటపడింది. స్కూల్ లో ఇదేం పని అని అడిగితే వాస్తు దోషం కోసం పూజలు చేస్తున్నట్లు రికార్డు అసిస్టెంట్ వెంకటేశం చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.

గొర్రెను పట్టుకొచ్చి బలిచ్చేందుకు యత్నించిన ఇద్దరు ఆ ప్రయత్నం విరమించుకుని అక్కడి నుంచి గొర్రెతో సహా వెళ్ళిపోయారు. మీడియా ప్రతినిధులు డిఈవోకు సమాచారం ఇవ్వడంతో పాఠశాలకు ఎంఈవో రఘుప...