భారతదేశం, నవంబర్ 25 -- Simple Exercises to Relief Pains : మీరు డెస్క్ ఉద్యోగం చేస్తున్నారంటే.. మీరు ఒంటరి కాదు అని అర్థం. ఎందుకంటే మీతో మెడ నొప్పి, భుజం నొప్పి, వెన్ను నొప్పి, స్ట్రెస్ ఇలా చాలానే తోడుగా ఉంటాయి. వీటిని పట్టించుకోకపోతే సమస్య చాలా తీవ్రమవుతుంది. అలా అని ఉదయాన్నే లేచి వ్యాయామం చేసే సమయం మీకు దొరకకపోవచ్చు. అయితే మీరు మీ డెస్క్​లోనే ఉంటూ.. కొన్ని చిన్న వ్యాయామాలు చేస్తూ.. ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు అంటే నమ్ముతారా? అయితే ఈ సమస్యలను దూరం చేసే ఐదు సాధారణ స్ట్రెచ్‌లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

'స్కై క్యాచర్' అనేది ఎక్కడైనా మీరు చేయడానికి సులభమైన వ్యాయామం. కుర్చీలో కూర్చుని.. మీరు దీన్ని చేయడం చాలా సులభం. దీనికోసం మీరు చేయాల్సిందల్లా.. మీ రెండు చేతుల వేళ్లను ఇంటర్‌లాక్ చేసి.. చేతులను పూర్తిగా తెరిచి. వాటిని వీలైనంత వరకు పైకి, ప...