భారతదేశం, ఫిబ్రవరి 25 -- Silent Movie: ఇండియ‌న్ స్క్రీన్‌పై మూకీ సినిమాలు అరుదుగా వ‌చ్చాయి క‌మ‌ల్‌హాస‌న్ పుష్ప‌క విమానం త‌ర్వాత డైరెక్ట‌ర్లు ఎవ‌రూ సెలెంట్ సినిమాల జోలికి వెళ్ల‌లేదు. ప్ర‌స్తుతం త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి ఓ మూకీ మూవీ మూవీ చేస్తోన్నాడు. గాంధీ టాక్స్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధ‌మైంది.

తాజాగా టాలీవుడ్ డైరెక్ట‌ర్ జి అశోక్ ఓ మూకీ మూవీ చేయ‌బోతున్నాడు. తెలుగులో కాకుండా బాలీవుడ్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతున్న‌ ఈ మూవీకి ఉఫ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో నోరా ఫ‌తేహి, సోహామ్ షా, నుష్ర‌త్‌ బ‌రుచా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సింగిల్ డైలాగ్‌ లేకుండా సైలెంట్ మూవీగా ప్ర‌యోగాత్మ‌కంగా ఉఫ్ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం.

ఈ సినిమాను చాలా రోజుల క్రిత‌మే అనౌన్స్‌చేశారు. అనివా...