భారతదేశం, మార్చి 29 -- బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సికందర్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. రంజాన్ సందర్భంగా రేపు (మార్చి 30) ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ హిందీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి తమిళ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించారు. ఎంతో హైప్ ఉన్న సికందర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏ ఓటీటీలో తీసుకుందో తెలిసిపోయింది.

సికందర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రానికి స్ట్రీమింగ్ డీల్ చేసుకుంది. ఈ మూవీ హక్కుల కోసం సుమారు రూ.90కోట్లను నెట్‍ఫ్లిక్స్ వెచ్చించిందనే రూమర్లు ఉన్నాయి.

థియేట్రికల్ రన్ తర్వాత నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో సికందర్ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఇటీవల చాలా బాలీవుడ్ సినిమాలు థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాలకు...