తెలంగాణ,మెదక్, ఏప్రిల్ 10 -- అకాల వర్షం, వడగండ్ల వాన సిద్దిపేట జిల్లాలో బీభత్సం సృష్టించాయి. తెల్లవారుజామున మూడు గంటలకు మొదలైన వడగండ్ల వాన.. జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించింది. కోతకు వచ్చిన పంట. చెల్లాచెదురైంది. కోతకు వచ్చిన వరిచేన్లలో సగానికి పైగా వడ్లు రాలిపోయాయి. మరోవైపు మామిడి తోట రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. కోతకు వచ్చిన పండ్లు పూర్తిగా రాలిపోయాయి. దీంతో రైతులు తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లారు.

జిల్లాలోని నంగనూర్, చిన్న కోడూరు మండలాల్లో పొద్దునే ఎక్కడ చూసినా వడగండ్ల వాన కురిసింది. గురువారం ఉదయమే వ్యవసాయ, హార్టికల్చర్ డిపార్టుమెంట్ల అధికారులు పంట పొలాల్లో పర్యటించారు. నష్ట పోయిన రైతుల వివరాలు నమోదు చేసుకున్నారు. గురువారం సాయంత్రం కూడా. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం రావటంతో పంటలకు తీవ్ర నష్టం జరిగింది.

సిద...